ఏటీఎం కార్డు రెన్యువల్ చేస్తామని చెప్పి ఖాతాలో డబ్బును దొంగిలించిన ఘటన శనివారం జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. కుక్కునూరుకు చెందిన నక్కా కృష్ణ భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మోసం
Aug 21 2016 12:28 AM | Updated on Sep 4 2017 10:06 AM
కుక్కునూరు : ఏటీఎం కార్డు రెన్యువల్ చేస్తామని చెప్పి ఖాతాలో డబ్బును దొంగిలించిన ఘటన శనివారం జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. కుక్కునూరుకు చెందిన నక్కా కృష్ణ భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం సమయంలో అతనికి ఒకరు ఫోన్ చేసి తాము బ్యాంకు నుంచి చేస్తున్నామని, మీ ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలని, ఆ కార్డు ఏ సంవత్సరంలోదో చేప్పాలని హిందీలో అడిగారు. దీంతో కృష్ణ ఆ వివరాలు చెప్పాడు. వెంటనే అతని సెల్‌కు ఖాతా నుంచి రూ.7,000 డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో అవాక్కయిన కృష్ణ స్థానిక ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌తో తనకు ఫోన్ చేసిన నంబర్‌కు మాట్లాడించాడు. అవతల వ్యక్తి ఇంకా ఏమైనా నంబర్లు ఉంటే ఇవ్వాలని మేనేజర్‌ను కోరాడు. మీ చేతనైంది చేసుకోవాలని సవాల్ విసిరాడు. దీంతో లబోదిబోమనడం కృష్ణ వంతైంది.
Advertisement
Advertisement