కూడేరులో చిరుత సంచారం | cheatah halchal in kuderu | Sakshi
Sakshi News home page

కూడేరులో చిరుత సంచారం

Apr 8 2017 11:15 PM | Updated on Sep 5 2017 8:17 AM

కూడేరులో సంగమేశ్వర స్వామి దేవాలయం - అరవకూరు గ్రామం మధ్య ఉన్న కొండ ప్రాంతంలో శనివారం చిరుతపులి కనిపించినట్లు గొర్రెల కాపరులు తెలిపారు.

కూడేరు : కూడేరులో సంగమేశ్వర స్వామి దేవాలయం - అరవకూరు గ్రామం మధ్య ఉన్న కొండ ప్రాంతంలో శనివారం చిరుతపులి కనిపించినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. గొర్రెలను మేపు కోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లగా దూరంగా చిరుత కనిపించిందని, కుక్కలు అరవడంతో వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. తాము ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా గొర్రెలను కొండ నుంచి కిందకు తోలుకొచ్చేశామన్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement