ఘనంగా శ్రీచక్ర పూజ | celebrated sricakra puja | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీచక్ర పూజ

Sep 23 2016 6:40 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఘనంగా శ్రీచక్ర పూజ

ఘనంగా శ్రీచక్ర పూజ

స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం చాముండేశ్వరి అమ్మవారికి ఘనంగా శ్రీచక్రపూజను దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానందతీర్థ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రొద్దుటూరు కల్చరల్‌:
    స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం చాముండేశ్వరి అమ్మవారికి ఘనంగా శ్రీచక్రపూజను దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానందతీర్థ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం వేదపండితులు సత్యనారాయణస్వామి, సుదర్శన యోగ నరసింహస్వామి, ఆంజనేయస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామిలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మూలవిరాట్‌లను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం దత్త విజయానంద తీర్థస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీచక్ర పూజ చేయడం వల్ల కలిగే శుభాలను భక్తులకు వివరించారు. అలాగే లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, నారాయణ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి హోమద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు పూర్ణాహుతిగా సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

 

Advertisement

పోల్

Advertisement