-
సింగపూరులో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం
కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూరు వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని పీజీపీ హాలులో ఘనంగా జరుపుకున్నారు. సింగపూరు తెలుగువారితోపాటు, కన్నడ ప్రజలు కూడా ఈ వ్రతంలో పాల్గొనడం విశేషం. ఎంతో భక్తి శ్రద్దలతో 100 జంటలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దాదాపు 500 మంది స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్రతం చేసుకున్న దంపతులకు స్వామివారి కండువాలు, రూపులను నిర్వాహకులు అందించారు. ఈ అనంతరం స్వామి వారి ప్రసాద వితరణ జరిగింది. సంస్థ అధ్యకులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ కోవిడ్ అనంతరం తమ సంస్థ తరపున జరిపిన మొదటి ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే కార్యక్రమాన్ని అనుకున్న క్షణం నుండీ నిర్విరామంగా శ్రమించిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను రేపటి తరాలకు గుర్తుండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని చెప్పారు. -
ఘనంగా శ్రీచక్ర పూజ
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక వైఎంఆర్ కాలనీలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం చాముండేశ్వరి అమ్మవారికి ఘనంగా శ్రీచక్రపూజను దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానందతీర్థ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం వేదపండితులు సత్యనారాయణస్వామి, సుదర్శన యోగ నరసింహస్వామి, ఆంజనేయస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామిలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మూలవిరాట్లను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం దత్త విజయానంద తీర్థస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీచక్ర పూజ చేయడం వల్ల కలిగే శుభాలను భక్తులకు వివరించారు. అలాగే లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, నారాయణ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి హోమద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు పూర్ణాహుతిగా సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్‌జెట్‌కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement