రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు | CAO checks in Railway station | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు

Sep 23 2016 2:16 AM | Updated on Sep 4 2017 2:32 PM

రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు

రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు

వరంగల్‌ రైల్వేస్టేన్‌లో గురువారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలోని ఫైనాన్స్‌ అడ్వైజర్, చీఫ్‌ అకౌంటెంట్‌ ఆఫీసర్‌ (సీఏఓ) ఎం.పూర్ణ చర్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భగా స్టేషన్లోని అన్ని ప్లాట్‌ ఫాంలను పరిశీలించారు.

రైల్వేగేట్‌ :  అలాగే ఆర్‌పీఎఫ్‌లోని సీసీ కెమెరాల పనితీరుతోపాటు భవనం నుంచి వర్షానికి కారుతున్న నీళ్లను పరిశీలించారు. ప్రయాణికులతో క్లీన్ రైల్వే స్టేషన్పై మాట్లాడారు. వారి నుంచి అభిప్రాయాలను తెలసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైల్వే కళాకారులు స్వచ్ఛ రేల్‌..స్వచ్ఛ భారత్‌పై నృత్య ప్రదర్శన నిర్వహించి చైతన్య పరిచారు. క్లీన్ రైల్వే స్టేషన్కు సహకరించాలని ప్రయాణికులు, రైల్వే స్టేషన్ సిబ్బందిని పూర్ణ కోరారు. ఈ సందర్భగా ఆర్‌పీఎఫ్‌ వారు లిట్టరింగ్‌ కింద 10 కేసులను నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.200 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు, హరిప్రసాద్, సాగర్, సతీష్‌కుమార్, శ్రీనివాస్‌రావు, ఆర్‌పీఎఫ్‌ సీఐ నర్సింహ, ఏఎస్సై జనార్దన్, ధారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement