బాలుడిని మింగిన నీటిసంపు | Boy died in water sampu | Sakshi
Sakshi News home page

బాలుడిని మింగిన నీటిసంపు

Aug 24 2016 11:21 PM | Updated on Sep 4 2017 10:43 AM

బాలుడిని మింగిన నీటిసంపు

బాలుడిని మింగిన నీటిసంపు

ఆడుకుంటూ వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కిష్టాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

కిష్టాపురం(సత్తుపల్లి రూరల్‌) : ఆడుకుంటూ వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కిష్టాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముల్లగిరి వీరేంద్రబాబు, జ్యోతి దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. జ్యోతి ఎదురింట్లో సంపు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటుండగా.. అక్కడికి ఆడుకుంటూ వచ్చిన జయవర్ధన్‌(3) ప్రమాదవశాత్తు నీటిసంపులో పడిపోయాడు. వెంటనే గమనించిన తల్లి బాబును బయటకు తీసి.. చుట్టుపక్కల వారిని పిలిచి హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే జయవర్ధన్‌ మృతిచెందాడని తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

24ఎస్‌పిఎల్‌41 : మృతిచెందిన జయవర్ధన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement