బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి | Bike collided..women died | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

Sep 17 2016 10:29 PM | Updated on Sep 4 2017 1:53 PM

మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నాగదాసరి సుబ్బమ్మ(52) మృతి చెందింది.

బద్వేలు అర్బన్‌: మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నాగదాసరి సుబ్బమ్మ(52) మృతి చెందింది. చెన్నంపల్లె సమీపంలోని ప్రగతినగర్‌ లో నివసించే ఆమె కూలి పనులు చేసుకొని జీవన ం సాగిస్తూ ఉండేది. శనివారం రాత్రి ఇంటి సమీపంలోని దుకాణం వద్దకు రోడ్డు దాటుకొని నడిచి వెళ్తుండగా.. బద్వేలు నుంచి నాగిశెట్టిపల్లెకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఓ యువకుడు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది.వెంటనే స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement