కవిత్వ రచన సామాజిక బాధ్యత | balka kavitvam relase | Sakshi
Sakshi News home page

కవిత్వ రచన సామాజిక బాధ్యత

Aug 20 2016 11:42 PM | Updated on Sep 4 2017 10:06 AM

కవిత్వ రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రజల కష్టాలను ప్రతిబింబించే రచనలు వెలువడతాయని ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి అన్నారు. ముస్తాబాద్‌ మండలం బందనకల్‌ ఉన్నత పాఠవాల విద్యార్థులు రాసిన బాల కవిత్వం, బదనకల్‌ హైస్కూల్‌ పద్యాలు, కవితా సంపుటిని శనివారం సిధారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.

  • కవి నందిని సిధారెడ్డి 
  • బాలకవిత్వం పుస్తకావిష్కరణ 
  • ముస్తాబాద్‌ : కవిత్వ రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రజల కష్టాలను ప్రతిబింబించే రచనలు వెలువడతాయని ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి అన్నారు. ముస్తాబాద్‌ మండలం బందనకల్‌ ఉన్నత పాఠవాల విద్యార్థులు రాసిన బాల కవిత్వం, బదనకల్‌ హైస్కూల్‌ పద్యాలు, కవితా సంపుటిని శనివారం సిధారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. పాఠశాల విద్యార్థి దశలోనే వివిధ సమస్యలపై అద్భుతమైన సాహిత్యాన్ని వెలువరించడం ఆనందాన్నిస్తోందన్నారు. ఆదరణ తగ్గుతున్న తెలుగు పద్యసాహిత్యంపై పట్టు సాధించి, సామాజిక అంశాలపై కలం కదిలిస్తూ విద్యార్థులు భాషకు జీవం పోయడం అద్భుతమన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన తెలుగు పండితుడు రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు విఠల్‌నాయక్‌ను అభినందించారు. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జనార్ధన్‌జయశ్రీ, ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, ఎంఈవోలు రాంచందర్‌రావు, మంకు రాజయ్య, సర్పంచ్‌ వెంకటస్వామి, హెచ్‌ఎంలు విఠల్‌నాయక్, రవి, డాక్టర్‌ రాజేందర్, ఎంపీటీసీ దుర్గవ్వ, ఎస్‌ఎమ్‌సీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 
     

Advertisement

పోల్

Advertisement