అయుత చండీయాగం పనులు వేగిరం | Ayuta chandiyagam accelerate tasks | Sakshi
Sakshi News home page

అయుత చండీయాగం పనులు వేగిరం

Dec 6 2015 3:11 AM | Updated on Aug 21 2018 5:52 PM

అయుత చండీయాగం పనులు వేగిరం - Sakshi

అయుత చండీయాగం పనులు వేగిరం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ యాగం జరుగనుంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 10 గ్యాలరీలను పూర్తి చేశారు. పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వరశర్మ, బ్రహ్మశ్రీ ఫణి శశాంక్‌శర్మ ఆచార్య బ్రహ్మలుగా వ్యవహరిస్తున్న ఈ అయుత చండీయాగంలో... 1,500 మంది రుత్విక్కులుగా పాల్గొంటున్నారు. ఏకోత్తర వృద్ధి విధానంలోనే జరిపే ఈ అయుత చండీయాగంతో పాటు రుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు కూడా జరగనున్నాయి.

► శృంగేరీ పీఠం వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, శశాంక్‌శర్మ, గోపీకృష్ణ అయుత చండీయాగం నిర్వహిస్తారు.
► మొత్తం 1,500 మంది రుత్విక్కులు హాజరుకానున్నారు.
► 108 హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. 1,100 మంది బ్రాహ్మణులు ఐదు రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణాలు చేస్తారు.
► మొదటి రోజు 1,100 మంది బ్రాహ్మణులు ఒకేసారి సప్తశతి చేసి, నాలుగు వేల పారాయణాలు చేస్తారు.
► రెండోరోజు 1,100 మంది బ్రాహ్మణులు రెండు పారాయణాలు చేసి, మూడు వేల జపాలు చేస్తారు.
► మూడో రోజు 1,100 మంది బ్రాహ్మణులు మూడు పారాయణాలు, రెండు వేల జపాలు చేస్తారు.
► నాలుగో రోజు 1,100 మంది బ్రాహ్మణులు 4 పారాయణాలు, వేయి జపాలు చేస్తారు.
► చివరి రోజు ఒక్కో హోమం గుండం వద్ద పదకొండు మంది రుత్విక్కులు పాలతో పది వేల పారాయణాలు, దశాంశం వేయిసార్లు తర్పణలిచ్చి, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
► 400 మంది బ్రాహ్మణులు రుత్విక్కులకు సేవలు అందిస్తారు.

 ప్రత్యేక ఏర్పాట్లు..
► {బాహ్మణుల కోసం 4 యాగశాలలు
► వారు అక్కడే ఐదు రోజులు ఉండేందుకు వీలుగా వసతులు
► చండీయాగంలోకి రుత్విక్కులకే అవకాశం
► వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా.. భక్తులు, ప్రజల కోసం వేరుగా ఏర్పాటు
► రోజూ పది వేల నుంచి అరవై వేల మందికి భోజన ఏర్పాట్లు
► {పతి గ్యాలరీ వద్ద చండీయాగం చూసేందుకు టెలివిజన్ సెట్‌లు.. నిఘా కోసం సీసీ కెమెరాలు
► మీడియాకు ప్రత్యేక గ్యాలరీ, వారికి ఎప్పటికప్పుడు సమాచారం
► {పతి రోజూ సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు
► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మంది హరినాథులు హాజరు  
► ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, గంగాపూర్, వర్ధరాజ్‌పూర్ గ్రామాల వద్ద 10 పార్కింగ్ స్థలాలు
► ఎర్రవల్లి మీదుగా ప్రజలు, నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు
► వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అతిథులకు శివారు వెంకటాపూర్ నుంచి ప్రవేశం
 
  పనుల వేగం పెంచాలి: సీఎం కేసీఆర్
 చండీయాగం పనుల వేగం పెంచాలని నిర్వాహకులకు సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మొదట చండీయాగం స్థలానికి చేరుకుని పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సీఎం అరగంటపాటు అక్కడే ఉండి పనుల గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతి ముందుస్తుగానే ఫాంహౌస్‌కు చేరుకుని పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. రాత్రి వ్యవసాయ క్షేత్రంలోనే బస చేస్తారు. ఆదివారం ఉదయం చండీయాగం పనులను మళ్లీ పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూం పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement