నెల్లూరు(దర్గామిట్ట) : నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్‌లో గూడ్స్ సర్వీస్ టాక్స్(వస్తువులపై సర్వీస్ పన్ను విధానం) అమలుపై అవగాహన సదస్సు ఆదివారం జరిగింది
జీఎస్‌టీపై అవగాహన సదస్సు
Nov 7 2016 1:09 AM | Updated on Sep 4 2017 7:23 PM
నెల్లూరు(దర్గామిట్ట) : నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్‌లో గూడ్స్ సర్వీస్ టాక్స్(వస్తువులపై సర్వీస్ పన్ను విధానం) అమలుపై అవగాహన సదస్సు ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ కాదర్ రహమాన్, అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ టాక్స్ శ్రీ భావన మోహన్ హాజరయ్యారు.రహమాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర çప్రభుత్వాలు టాక్స్ విధానంలో పాత పద్ధతులు విడనాడి కొత్త తరహా విధానం అమలులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఒక జోన్ పరిధిలో ఉన్నాయని, ఈ జిల్లాల్లోని వాణిజ్య, వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని కోరారు. జిల్లా వాపారస్తులు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సమస్యలపై అధికారులతో అవగాహన కల్పిస్తామన్నారు. భావన మోహన్ మాట్లాడుతూ వ్యాపార లావాదేవీలలో మెళకువలు నేర్చుకోవడమే కాక పన్నులపై అవగాహన కల్గి ఉండాలన్నారు. çమన రాష్ట్రంలో తయారైన వస్తువులకు ఒకే పన్ను విధానముంటుందని, ఇతర రాష్ట్రాలతో తయారైతే కచ్చితంగా సుంకం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్‌అండ్ కన్సల్టెంట్ ప్రసిడెంట్ ఏవీఎస్.కృష్ణమోహన్, నెల్లూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ,, రాష్ట్ర హోటల్స్ అసోషియేన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, ఎడిబుల్ ఆయిల్స్ అసోషయేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Advertisement
Advertisement