తల్లీకూతుళ్లపై దాడి | attack on women | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లపై దాడి

Dec 14 2016 12:15 AM | Updated on Sep 4 2017 10:38 PM

కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్‌ పరిధిలో విద్యుత్‌నగర్‌లో నివసిస్తున్న ఎ.వెంకటలక్షుమ్మ, ఆమె కుమార్తెపై వినాయకుడి గుడి సమీపంలో ఆరుగురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటలక్షుమ్మ భర్త బాలిరెడ్డి డీఆర్‌డీఏలో పనిచేస్తూ ఉద్యోగం పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు.

కడప అర్బన్‌ : కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్‌ పరిధిలో విద్యుత్‌నగర్‌లో నివసిస్తున్న ఎ.వెంకటలక్షుమ్మ, ఆమె కుమార్తెపై వినాయకుడి గుడి సమీపంలో ఆరుగురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటలక్షుమ్మ భర్త బాలిరెడ్డి డీఆర్‌డీఏలో పనిచేస్తూ ఉద్యోగం పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. ఆలంఖాన్‌పల్లెలో కొంతకాలం కుటుంబ సభ్యులతోపాటు ఉండేవాడు. అప్పులు అధికమై కుటుంబాన్ని వదిలేసి వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేసేందుకు వచ్చారని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వస్తుండగా వినాయకుడి ఆలయం వద్ద కాపుకాచిన కొందరు గత రాత్రి 11 గంటల సమయంలో తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులలో శేఖర్‌రెడ్డి, వీరారారెడ్డి, ఇంకొకరు ఉన్నారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌకు హెడ్‌ కానిస్టేబుల్‌ గౌరీనాథ్‌ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement