ఏటీఎం దొంగ అరెస్టు | ATM ROBBERY | Sakshi
Sakshi News home page

ఏటీఎం దొంగ అరెస్టు

Jul 23 2016 11:31 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఇతరుల ఏటీఎం కార్డుల వివరాలతో, వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న హైదరాబాద్‌ చింతల్‌కు చెందిన రామిరెడ్డి రోషన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పేకేటి సారధి ఫిర్యాదు మేరకు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో..

కాకినాడ సిటీ : ఇతరుల ఏటీఎం కార్డుల వివరాలతో, వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న హైదరాబాద్‌ చింతల్‌కు చెందిన రామిరెడ్డి రోషన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పేకేటి సారధి ఫిర్యాదు మేరకు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై కె.వంశీధర్, కానిస్టేబుల్‌ కె.రూప్‌కుమార్‌ దర్యాప్తు చేసి, నిందితుడిని స్ధానిక కోకిలా సెంటర్‌లో అరెస్టు చేశారు. ఆరు నెలలుగా రోష¯Œæరెడ్డి ఏటీఎంల వద్ద ఉంటూ, అమాయకుల ఏటీఎం కార్డులను మోసపూరితంగా తీసుకున్నాడు. తణుకు, గుడివాడ, వినుకొండ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, కాకినాడల్లో ఈ నేరాలకు పాల్పడ్డాడు. బాధితుడు సారధి ఖాతా నుంచి రూ.15 వేలు, మిలిగిన చోట్ల సుమారు రూ.4 లక్షలు కాజేశాడు. ఆయా కేసుల్లో నిందితుడు వినియోగించిన టెక్నాలజీని ఛేదించి, బ్యాంకుల నుంచి సెల్‌ఫోన్‌ డేటా ద్వారా అతడిని పట్టుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement