ఏలూరు (మెట్రో) : బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి సోపాన సంక్షేమ పథకాల ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాపు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
Aug 12 2016 10:00 PM | Updated on Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి సోపాన సంక్షేమ పథకాల ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఎపిఒబిఎమ్‌ఎమ్‌ఎస్.సిజిజి.జిఒవి.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 11వ తేదీ నుంచి అవకాశాన్ని కల్పించినట్టు ఆయన తెలిపారు.
లబ్ధిదారులు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారై ఉండి, 21 నుంచి 50 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలని, తెల్లరేషన్ కార్డు, గ్రామీణ ప్రాంతాల వారికి సంవత్సరాదాయం రూ.80 వేలు, పట్టణ ప్రాంతాల వారికి లక్షా 30 వేల రూపాయలు కలిగి ఉండాలన్నారు. రేషన్‌కార్డుకు ఒక్క యూనిట్‌కు మాత్రమే అర్హులని, లబ్ధిదారుడు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఫొటో, కుల ధ్రువీకరణ పత్రంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మండలం, మునిసిపల్ కార్యాలయాలతో పాటు, మీసేవ కేంద్రాల్లోనూ దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Advertisement


