ఆక్వా పార్క్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం | AQUA PARK.. DIP IN BAY OF BENGAL | Sakshi
Sakshi News home page

ఆక్వా పార్క్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం

Mar 29 2017 12:08 AM | Updated on May 29 2018 4:37 PM

ఆక్వా పార్క్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం - Sakshi

ఆక్వా పార్క్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం

గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధిత గ్రామాలైన తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పర్యటిం చారు...

నరసాపురం : గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధిత గ్రామాలైన తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పర్యటిం చారు. ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పో రాడుతున్న గ్రామస్తులపై సోమవారం పోలీసులు దౌర్జన్య కాండ జరిపిన విషయం తెలిసిందే. బాధితులను మంగళవారం వైఎస్సార్‌ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, ఆచంట నియోజక వర్గ కన్వీనర్‌ కవురు శ్రీనివాస్‌ మంగళవారం పరామర్శించారు. ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వా మ్య విలువలకు పాతరేసి పచ్చని గ్రామాల్లో దమనకాండ సృష్టిస్తోందని విమర్శించారు. దీనిని వైఎస్సార్‌ సీపీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు తుందుర్రులో పర్యటిస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే ఫ్యాక్టరీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. ఇక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆగే వరకూ వైఎ స్సార్‌ సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. పోలీసుల సాయంతో జరుగుతున్న దమనకాండకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు సముద్రంలో కలిసేలా పైప్‌లైన్‌లు వేసేస్తున్నామని మంత్రుల నుం చి కూడా ప్రకటనలు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రకటనలు చేస్తు న్న మంత్రులు ఇక్కడకు వచ్చి పైప్‌లైన్‌లు చూపించాలని డిమాండ్‌ చేశారు. దౌర్జన్యాలు, అణచివేత ద్వారా ఏదో చేద్దామనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండదన్నారు. వెంటనే ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలించాల ని కోరారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తుందు ర్రు చుట్టుపక్కల గ్రామాల మహిళలకు జరుగుతున్న అవమానాలు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందన్నారు. పాకిస్తాన్‌ సరిహద్దు వాతావరణాన్ని సృష్టిం చడం ఎంతవరకూ సమంజసమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. సీపీఎం నేతలు బి.బలరామ్, కవురు పెద్దిరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు పాలంకి ప్రసాద్, సాయినాథ్‌ప్రసాద్, బర్రి శంకరం, మెగా ఆక్వాఫుడ్‌పార్కు పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. 
 
చీరలు లాగించే సంప్రదాయం ఆపండి
‘సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానని పదేపదే చెబుతున్నారు, సింగపూర్‌ తరువాత చేద్దువుగాని ముందు పోలీసులతో మహిళల చీరలు లాగించే సంప్రదాయాన్ని కట్టిపెట్టం డి’ అని బాధిత గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మేమెప్పుడూ రోడ్డెక్కలేదు.. పోలీస్‌స్టేషన్‌లు చూడలేదు.. గుట్టుగా సంసారం చేసుకునే వాళ్లం.. మా మీద అంత కక్ష సాధింపు ఎందుకంటూ మహిళలు వైఎస్సార్‌ సీపీ నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అర్ధరాత్రి నుంచి సోదాలు
అర్ధరాత్రి నుంచి పోలీసులు సోదాలు చేశారని, రోడ్డుమీదకు రాగానే లాక్కెళ్లి పోయారని తుందుర్రుకు చెందిన సముద్రాల నాగమణి పేర్కొంది.   60 రోజులు జైల్లో ఉన్నా కన్నీళ్లు రా లేదు. నిన్న నా కొడుకును నాముందే తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకెళుతుంటే తట్టుకోలేకపోయా అని ఉద్యమ నాయకురాలు ఆరేటి సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement