'మట్టిని మోదీకి పంపడం సంతోషంగా ఉంది' | AP PCC Chief raghuveera reddy starts matti saytagraham at steel plant | Sakshi
Sakshi News home page

'మట్టిని మోదీకి పంపడం సంతోషంగా ఉంది'

Nov 18 2015 10:33 AM | Updated on Aug 18 2018 9:13 PM

'మట్టిని మోదీకి పంపడం సంతోషంగా ఉంది' - Sakshi

'మట్టిని మోదీకి పంపడం సంతోషంగా ఉంది'

ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మట్టిని సేకరించి ప్రధాని మోదీకి పంపడం సంతోషంగా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.

విశాఖపట్నం : ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మట్టిని సేకరించి ప్రధాని మోదీకి పంపడం సంతోషంగా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం విశాఖపట్నం నగరంలోని స్టీల్ప్లాంట్ వద్ద రఘువీరా మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది.

అది కాక రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ... ప్రత్యేక హోదాపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోగా... పార్లమెంట్ వద్ద మట్టీతోపాటు యమున నది నీటిని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ... ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మట్టి సత్యాగ్రహం చేపట్టిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement