లండన్‌లో ఉన్న అమరావతి శిల్ప సంపదను రప్పించాలి | Amaravathi silpam to be taken from london | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఉన్న అమరావతి శిల్ప సంపదను రప్పించాలి

Oct 31 2015 9:58 PM | Updated on Sep 3 2017 11:47 AM

లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియం, తమిళనాడు రాష్ట్రం చెన్నై మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదను వెనక్కు తెప్పించేందుకు చర్యలు...

-కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌కు లేఖ
సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియం, తమిళనాడు రాష్ట్రం చెన్నై మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదను వెనక్కు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌కు లేఖ రాశారు. అమరావతిని కేంద్ర ప్రభుత్వం హరిటేజ్ సిటీగా ప్రకటించినందున ఆయా ప్రాంతాల్లోని బౌద్ధ శిల్ప సంపదను వెంటనే తెప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఆస్ట్రేలియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బుద్ధుడి విగ్రహం, జర్మనీలో ఉన్న దుర్గమాత విగ్రహాలను ఆయా దేశాలు పంపేందుకు సమ్మతిస్తూ లేఖ ద్వారా సమాచారం పంపారని వాటి ఆదారంగా లండన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అమరావతి శిల్ప సంపదను తెప్పించాలని కోరారు.

Advertisement

పోల్

Advertisement