సామూహిక ఉద్యమాలు నిర్వహించాలి | Administer mass movements | Sakshi
Sakshi News home page

సామూహిక ఉద్యమాలు నిర్వహించాలి

Dec 23 2016 1:29 AM | Updated on Sep 4 2017 11:22 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు సామూహిక ఉద్యమాలు నిర్వ హించాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సూచించారు.

పెన్‌పహాడ్‌: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు సామూహిక ఉద్యమాలు నిర్వ హించాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల కేంద్రం లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి గణిత మేళా ముగింపు కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పాఠ శాల నిర్వహణ కోసం పర్యవేక్షణ అధికారులను నియమించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం కాదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరహాలోనే అభివృద్ధిలోనూ అందరి మద్దతు తీసుకోవాలన్నారు.

Advertisement

పోల్

Advertisement