ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చేస్తున్నారు | adivasi areas becoming partitions | Sakshi
Sakshi News home page

ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చేస్తున్నారు

Sep 5 2016 12:17 AM | Updated on Sep 4 2017 12:18 PM

ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చేస్తున్నారు

ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చేస్తున్నారు

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్‌ ఆదివాసీ ప్రాంతాలను సీఎం కేసీఆర్‌ ముక్కలు చేస్తున్నాడని మన్యసీమ రాష్ట్రసాధన సమితి జాతీయ కన్వీనర్‌ చందా లింగయ్య అన్నారు.

కేయూ క్యాంపస్‌ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్‌ ఆదివాసీ ప్రాంతాలను సీఎం కేసీఆర్‌ ముక్కలు చేస్తున్నాడని మన్యసీమ రాష్ట్రసాధన సమితి జాతీయ కన్వీనర్‌ చందా లింగయ్య అన్నారు. ఆదివా రం ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ), ఆదివాసీ విద్యార్థి సంఘం జేఏసీ, పలు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కేయూ దూరవిద్య కేంద్రంలోని జాఫర్‌నిజాం సెమినార్‌ హాల్‌లో సమావేశంలో నిర్వహించారు. ఇందులో ఐదో షెడ్యూల్‌ భూభాగాన్ని ఆదివాసీల జిల్లాలుగా చేయాలనే చర్చ జరిగిం ది. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక మన్యసీమ ఆదివాసీ రాష్ట్రం కోసం తెలంగాణ నుంచి వేర్పాటు ఉద్యమాన్ని విద్యార్థులతో ఉధృతం చేస్తామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర పోలిట్‌బ్యూరో చైర్మన్‌ బూర్క పోచయ్య ఆదివాసీల ప్రాంతాలను పాలకవర్గాలు విధ్వం సం చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘాలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు మైపతి అరుణ్‌కుమార్, బాధ్యులు వెంకట్, సాయిబాబా, జిల్లా అధ్యక్షుడు తాటి హన్మంతరావు, రవి, ఆలంకిషోర్, సిద్దబోయిన లక్ష్మినారాయణ, ఈసం సుధాకర్, ఇర్ప విజయ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement