రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకుంటే చర్యలు | action will be taken in the construction of the low quality road | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకుంటే చర్యలు

Jul 20 2016 5:47 PM | Updated on Sep 4 2017 5:29 AM

రహదారి పనుల్లో నాణ్యతలోపిస్తే చర్యలు తప్పవని భారీనీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను హెచ్చరించారు.

రహదారి పనుల్లో నాణ్యతలోపిస్తే చర్యలు తప్పవని భారీనీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను హెచ్చరించారు. నారాయణఖేడ్ -కంగ్టి రహదారిపై రూ.7.20 కోట్లతో నిర్మిస్తున్న 4 వంతెనల పనులకు మంత్రి హరీష్‌రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అబ్బెంద గ్రామం వద్ద ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి మాట్లాడుతూ కంగ్టి- నారాయణఖేడ్ రహదారి పనులు నత్తనడకన నడుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు ఉంటాయని అన్నారు. కంగ్టి- నారాయణఖేడ్ రహదారిని గతంలో రూ.53 కోట్లతో డబుల్‌రోడ్డుగా మార్చామని, మధ్యలో వంతెనలు మిగిలిపోవడంతో వంతెనలకు నిధులు మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కంగ్టిలో నారాయణఖేడ్ తరహాలో బట్టర్‌ఫ్లై లైట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement