రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకుంటే చర్యలు
రహదారి పనుల్లో నాణ్యతలోపిస్తే చర్యలు తప్పవని భారీనీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు అధికారులను హెచ్చరించారు. నారాయణఖేడ్ -కంగ్టి రహదారిపై రూ.7.20 కోట్లతో నిర్మిస్తున్న 4 వంతెనల పనులకు మంత్రి హరీష్రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అబ్బెంద గ్రామం వద్ద ఆర్అండ్బీ అధికారులతో మంత్రి మాట్లాడుతూ కంగ్టి- నారాయణఖేడ్ రహదారి పనులు నత్తనడకన నడుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు ఉంటాయని అన్నారు. కంగ్టి- నారాయణఖేడ్ రహదారిని గతంలో రూ.53 కోట్లతో డబుల్రోడ్డుగా మార్చామని, మధ్యలో వంతెనలు మిగిలిపోవడంతో వంతెనలకు నిధులు మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కంగ్టిలో నారాయణఖేడ్ తరహాలో బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.