మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అను సంధానం చేసి ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని టెక్నికల్ అసిస్టెంట్ రామాంజనేయులు తెలిపారు.
గార్లదిన్నె : మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అను సంధానం చేసి ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని టెక్నికల్ అసిస్టెంట్ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో పోస్టఫీసు ద్వారా ఉపాధి బిల్లులు అందించేవారన్నారు. ఇక నుంచి బ్యాంకుల ద్వారా బిల్లులు మంజూరు అవుతాయన్నారు.
మండలంలో దాదాపు 13 వేల మంది ఉపాధి కూలీలు ఉండగా వారిలో 6వేల మంది మాత్రమే ఉపాధి పనులకు వెళ్తున్నారన్నారు. దాదాపు 1500 మంది కూలీలు బ్యాంకు ఖాతాలు లేవన్నారు. 15 రోజుల్లోపు బ్యాంకు ఖాతాలు ఇవ్వాలన్నారు. వర్మి కంపోస్టు యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా బ్యాంకు ఖాతాకు ఆధార్ అను సంధానం చేయాలన్నారు.