
వరాల తల్లికి విశేష పూజలు
మండలంలోని కొత్తపేట, బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ తల్లికి ఆదివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే చన్నీటి స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొత్తపేట, బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ తల్లికి ఆదివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే చన్నీటి స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కోర్కెలు తీరిన భక్తులు బోనాలతో అమ్మవారి వద్దకు చేరుకుని వస్త్రాభరణాలను కానుకలుగా సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ సమీపానగల పోతురాజు వద్ద ముద్దలను ఏర్పాటు చేసి జంతుబలి ఇచ్చారు. ఆలయ ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య బంధుమిత్రులతో ఆనందంగా విందు భోజనాలు ఆరగించారు.