భువనగిరిలో వివాహిత అదృశ్యం | a lady missing in bhuvanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో వివాహిత అదృశ్యం

Jul 27 2016 11:51 PM | Updated on Sep 4 2017 6:35 AM

వివాహిత ఆదృశ్యమైంది. ఈ ఘటన భువనగిరిలో బుధవారం వెలుగులోకి వచ్చింది

భువనగిరి అర్బన్‌  
 వివాహిత ఆదృశ్యమైంది. ఈ ఘటన భువనగిరిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ ంలోని హుస్నాబాద్‌కు చెందిన కొలిపాక  మల్లయ్య కుమారుడు  పాండుకు బీబీనగర్‌ మండలానికి చెందిన నాగరాణితో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.  కొన్ని రోజులగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గోడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగరాణి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో తన అమ్మగారి ఇంటికి వెళ్తానని పాండు పెద్దనాన్న కుమార్తె రేణుకతో కలిసి ఇంటి నుంచి బయలు దేరింది. హుస్నాబాద్‌ నుంచి స్థానిక కిసాన్‌నగర్‌కు వచ్చింది. రేణుకను అక్కడే వదిలి అమ్మగారి ఇంటికి పోతునట్లు భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌ వైపునకు వెళ్లింది. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఇంటికి రాక పోవడంతో వెంటనే చుట్టు పక్కల ప్రాంతాలు, బంధువుల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఆమె భర్త  పాండు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ  ఎస్‌. మంజునాథ్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement