నూతన కార్యవర్గం
నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహలక్ష్మి అమ్మవారి ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది.
డాబాగార్డెన్స్:నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహలక్ష్మి అమ్మవారి ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్‌గా వుప్పల భాస్కరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా చిప్పాడ చంద్రరావు, పి.వి.గిరిధర్, పి.వెంకటరమణ, కదా భాస్కరరావు, ఓదూరు శివయ్య, రావి చలపతిరావు, విజయ్‌కుమార్, చీదరాల దుర్గాప్రసాద్‌తో పాటు ఎక్ష్‌అఫిషియో సభ్యుడిగా బందావన దేశికాచార్యుడుచే ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేషకుమార్, బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, విశాఖపట్నం పోర్టు ట్రస్టీ టి.సుబ్బరామిరెడ్డి, ఆలయ ఉప కలెక్టర్, ఈవో ఎస్.జ్యోతిమాధవి,ఆలయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు సీహెచ్‌వీ రమణ, సహాయ కార్యనిర్వాహణాధికార్లు వి.రాంబాబు, పి.రామారావు, సహాయ ఇంజనీరు కె.ఎస్.ఎన్.మూర్తి, పర్యవేక్షకులు ఎన్.వి.వి.ఎస్.ఎస్.ఏ.ఎన్.రాజు, సూర్యకుమారి పాల్గొన్నారు.