వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ బ్రహ్మారెడ్డి
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 12 వినతులు వచ్చాయి. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వినతులను స్వీకరించారు. త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ తగాదాలకు చెందినవి ఒకటి, సివిల్ తగాదాలు రెండు, పాతకేసుల పరిష్కారం కోరుతూ రెండు, ఇతర కారణాలతో ఏడు వినతులు వచ్చాయి.
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 12 వినతులు వచ్చాయి. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వినతులను స్వీకరించారు. త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ తగాదాలకు చెందినవి ఒకటి, సివిల్ తగాదాలు రెండు, పాతకేసుల పరిష్కారం కోరుతూ రెండు, ఇతర కారణాలతో ఏడు వినతులు వచ్చాయి. అలాగే, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పది వినతులు రాగా, వాటిలో నాలుగు తక్షణమే పరిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వివేకానంద, కె.భార్గవరావునాయుడు, విశ్రాంత ఎస్‌ఐ పి.రాజేశ్వరరావు, న్యాయవాది టి.వరప్రసాదరావు, ఐసీడీఎస్, డీఆర్‌డీఏల నుంచి జ్యోతి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.