మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య  | Women Committed Suicide In Medak | Sakshi
Sakshi News home page

మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య 

Jul 5 2018 11:02 AM | Updated on Jul 5 2018 11:02 AM

Women  Committed Suicide In Medak - Sakshi

మృతి చెందిన కవిత

మిరుదొడ్డి(దుబ్బాక): తీవ్ర మనస్తాపానికి గురై వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తొగుట మండలం గుడికందుల గ్రామంలో జరిగినట్లు ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన  కథనం ప్రకారం... గుడికందుల గ్రామానికి చెందిన సూకూరి నర్సింహులుతో తొగుట మండల కేంద్రానికి చెందిన కవిత(వర్షిత)(24)కు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

కాగా ఇటీవల కవిత టీఆర్‌టీ పరీక్ష రాసింది. పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. మనస్తాపానికి గురైన కవిత బుధవారం ఇంట్లో ఎవరులేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి రాస కనకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement