దారుణం : పెళ్ళిలో డ్యాన్స్ చేసిందని భార్యను చంపేశారు! | Woman Murdered by Husband in West bengal | Sakshi
Sakshi News home page

పెళ్లిలో భార్య డాన్స్ చేసిందని..

Mar 19 2018 11:51 AM | Updated on Jul 30 2018 8:41 PM

Woman Murdered by Husband in West bengal - Sakshi

సాక్షి, కోల్‌కతా : ఓ భర్త వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిందనే అక్కసుతో తన భార్యను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్  24 పరగణాల జిల్లాలోని బసంతిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో  ఇటీవలే  వివాహం జరిగింది.  అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది.

అనంతరం తల్లితో కలిసి సుబీర్‌ ఇంటికి వెళ్ళిపోయాడు. కొపం తట్టుకోలేక తల్లితో కలిసి స్వప్నను గొంతు నులిమి చంపేశాడు. ఆపై తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరిని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే స్వప్న తల్లిదండ్రులు సుబీరే తమ కూతురిని హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి. దీంతో సుబీర్‌, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement