అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | Woman Died Suspicious Circumstances Medak | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Jan 26 2019 1:08 PM | Updated on Jan 26 2019 1:08 PM

Woman Died Suspicious Circumstances Medak - Sakshi

అలివేణి మృతదేహం

జోగిపేట(అందోల్‌): తన కూతురు కుర్ర అలవేణి (30) మరణంపై అనుమానాలున్నాయని మృతురాలి తండ్రి సంగయ్య శుక్రవారం జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన సంగయ్య తన కూతురును 5 సంవత్సరాల క్రితం వట్‌పల్లి మండలం బిజిలీపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు ఇచ్చి వివాహం చేశారు. గురువారం రాత్రి అలివేణి (30)కి కడుపునొప్పి రావడంతో భర్తతోపాటు వారి కుటుంబ సభ్యులు కన్‌సాన్‌పల్లి గ్రామంలో చికిత్సలు చేయించారు. తిరిగి అదే రాత్రి ఇంటికి తీసుకువెళ్లారు. ఉదయం చాలా సేపటి వరకు కూడా ఆమె బయటకు రాకపోవడంతో పక్కింట్లో ఉండే æమహిళ కూలీ పని ఉందని చెప్పడానికి వచ్చి అలివేణి  తీవ్ర అస్వస్థతతో ఉండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

ఈ విషయమై మృతురాలి తల్లిదండ్రులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందన్నారు. నా బిడ్డ చనిపోవడానికి మీరే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైతే ఎందుకు చెప్పలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు. జోగిపేట ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement