బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి | Watchman Was Beaten After Being Accused Of Molesting A Girl | Sakshi
Sakshi News home page

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

Jul 15 2019 7:44 PM | Updated on Jul 15 2019 7:48 PM

Watchman Was Beaten After Being Accused Of Molesting A Girl - Sakshi

‘వాచ్‌మెన్‌ను చితకబాది నగ్నంగా ఊరేగించారు’

ముంబై : మహిళలు, బాలికలపై కామాంధుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన వాచ్‌మెన్‌ను స్ధానికులు చితకబాది వీధుల్లో నగ్నంగా ఊరేగించిన ఘటన మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో వెలుగుచూసింది. విరార్‌ ప్రాంతంలోని రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ వాచ్‌మెన్‌ ఆదివారం రాత్రి బాలికను లైంగిక వేధింపులకు గురిచేయడంతో నిందితుడిని మహిళలు సహా పలువురు చితకబాదారు.

స్ధానికులు దేహశుద్ధి చేయడంతో గాయపడిన నిందితుడు 22 ఏళ్ల వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించామని, అతడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అర్నాలా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అపర్‌ సాహెబ్‌ లింగ్రే తెలిపారు. కాగా బాలిక ట్యూషన్‌ నుంచి తిరిగివస్తుండగా వాచ్‌మెన్‌ తమ కుమార్తెను అభ్యంతరకరంగా తాకాడని బాధితురాలి తల్లి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement