కారులో మంటలు  | Three escape after car catches fire In Kadthal | Sakshi
Sakshi News home page

కారులో మంటలు 

Mar 18 2020 1:35 AM | Updated on Mar 18 2020 1:35 AM

Three escape after car catches fire In Kadthal - Sakshi

కాలిపోతున్న కారు

కడ్తాల్‌: ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం చరికొండ–పల్లెచెలక ఘాట్‌ రోడ్డులో మంగళవారం జరిగిన ఘటన వివరాలు.. చరికొండ గ్రామానికి చెందిన నీలాల మహేశ్‌ తన బంధువులైన బొమ్మరాజు శివ, సాయిలుతో కలిసి నగరంలోని సరూర్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 4 రోజు ల క్రితం వీరు మహేశ్‌ స్వగ్రామం చరికొండలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మంగళవారం ఉదయం కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

మార్గంమధ్యలో చరికొండ–పల్లెచెలక ఘాట్‌రోడ్డులో కారు ఆగిపోయింది. వాహనం నడుపుతున్న నీలాల మహేశ్‌ దిగి ఇంజిన్‌ బానట్‌ లేపి చూడగా పొగలు కమ్ముకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహేశ్‌ సూచన మేరకు కారులో ఉన్న ఇద్దరు కిందికి దిగారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement