పోలీసుల వేధింపులపై ఫిర్యాదు చేస్తా: నటి శ్రుతి | Supporting Actress Sruthi Complaint Molestation On Her | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులపై ఫిర్యాదు చేస్తా..

Published Sat, Jul 28 2018 8:15 AM | Last Updated on Sat, Jul 28 2018 8:42 AM

Supporting Actress Sruthi Complaint Molestation On Her - Sakshi

సాక్షి, చెన్నై: పోలీసులు లైంగికంగా వేధించారని నటి శ్రుతి శుక్రవారం తెలిపారు. వివాహం ఆశచూపి ఇంజినీర్లు, కోటీశ్వరులైన యువతను మోసగించినట్లు దాఖలైన కేసులో కోవై పాపనాయకన్‌పట్టికి చెందిన సహాయనటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోవై జైలులో నిర్బంధించారు. కండిషన్‌ బెయిలుపై విడుదలైన నటి శ్రుతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరినీ వివాహం చేసుకుంటానని తెలిపి మోసగించలేదన్నారు. తనను విచారిస్తున్న పోలీసులు లైంగికంగా వేధించారని పేర్కొన్నారు. విచారణ ముగియగానే దీనిపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement