
సాక్షి, పెద్దపల్లి : పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన మహిళా కానిస్టేబుల్ పాము కాటుకు గురైన ఘటన ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలింగ్ విధుల నిమిత్తమై బసంతనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ వనిత నందిమేడారం గ్రామానికి వెళ్లారు. డ్యూటీలో ఉన్న వనిత మంగళవారం రాత్రి పాము కాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, స్థానికుల సాయంతో వనితను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వనిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వనిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.