రాధేశ్యామ్‌ @ రూ.3 వేల కోట్ల స్కామ్‌

Radheshyam @ Rs 3,000 crore scam - Sakshi

ఎంఎల్‌ఎం కేసులో దర్యాప్తు ముమ్మరం

సాక్షి, హైదరాబాద్‌: ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ (ఎఫ్‌ఎంఎల్‌సీ) పేరుతో మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం)కు పాల్పడిన రాధేశ్యామ్‌ చేసిన స్కామ్‌ రూ.3 వేల కోట్ల వరకు ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీ సీఎండీగా వ్యవహరించిన ఆయన్ను ఈవోడబ్ల్యూ (ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హరియాణాలోని హిసార్‌కు చెందిన రాధేశ్యామ్, భన్సీలాల్, సురేందర్‌సింగ్, మనోజ్, సద్బీర్‌ సింగ్‌ తదితరులు ఎఫ్‌ఎంఎల్‌సీని రూ.1 లక్ష పెట్టుబడితో, అద్దె గదిలో ప్రారంభించారు.

రూ.7,500 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, అందులో రూ.2,500 రిజిస్ట్రేషన్‌ చార్జీ కింద మినహాయించి, మిగిలిన రూ. 5వేల విలువైన ఆరోగ్య ఉత్పత్తులు అందజేస్తామంటూ స్కీం మొదలు పెట్టారు. స్కీమ్‌లో చేరిన ఒక్కొక్కరు మరో ఇద్దర్ని చేర్పిస్తే రూ.500 చొప్పున కమీషన్‌ ఇస్తూ వచ్చారు. ఇలా పలు స్కీమ్‌లతో దేశవ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వారి నుంచి ఇప్పటివరకు రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో తెలుగు రా

ష్ట్రాలతో పాటు హరియాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వారున్నారు. ఇటీవల శ్యామ్‌ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఒక తుపాకి, 10 తూటాలు, 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్‌ ఫోన్లు, రూ.60 లక్షల నగదుతోపాటు 3 ఖరీదైన కార్లనూ స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top