సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు

Prostitution Scandal Reveaols Oroissa Police - Sakshi

ఐదుగురు అరెస్టు

జయపురం: స్థానిక పట్టణంలో గత కొంతకాలం నుంచి గుట్టుచప్పుడు లేకుండా జరగుతున్న ఓ సెక్స్‌రాకెట్‌ ముఠాపై నవరంగపూర్‌ పోలీస్‌ కొరడా ఝలిపించింది. సెక్స్‌రాకెట్‌కు సంబంధించిన సుమారు ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. అయితే వారిలో నలుగురు మగవాళ్లు, సహా ఒక మహిళ ఉండగా వారిలో ఇద్దరు నవరంగపూర్‌ జిల్లా వాసులుగా, మిగతా ఇద్దరు జయపురం పట్టణ వాసులుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్‌ రాజు సాహిలో ఒక అద్దె భవనంలో సెక్స్‌రాకెట్‌ నడుపుతున్నారని ఓ మహిళ తెలుసుకుని, ఆ ఇంటిపై దాడికి దిగగా అక్కడ ఓ యువతిని పట్టుకుని, పోలీసులకు అప్పగించింది. అయితే మరో ఇద్దరు యువకులు తప్పించుకుని, పారిపోయినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. అనంతరం ఆ యువతిని విచారణ చేపట్టిన పోలీసులు ఆమెది పశ్చిమబెంగాల్లోని మధుగ్రామ్‌ ప్రాంతంగా పోలీసులు గుర్తించారు.

సెక్స్‌రాకెట్‌కు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు నవరంగపూర్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తారీఫ్‌ మహమ్మద్‌ నేతృత్వంలో ఒక బృందం దర్యాప్తు చేపట్టేందుకు బయలుదేరినట్లు అదనపు ఎస్పీ సీహెచ్‌ హృదయానంద తెలిపారు. ప్రస్తుతం జరిగిన దర్యాప్తు ప్రకారం సెక్స్‌రాకెట్‌ సూత్రధారి ఆంధ్రప్రదేశ్‌లోని ఇచ్చాపురానికి చెందిన సతీష్‌కుమార్‌ సాహుగా తేలింది. అతడు వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి, సెక్స్‌రాకెట్‌ నడుపుతున్నట్లు తెలిసింది. అయితే సతీష్‌కుమార్‌ సాహు జయపురంలోని పారాబెడలో ఉన్న ఓ అద్దె ఇంటిలో ఉంటూ ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సతీష్‌ నివాసంపై దాడి చేయగా, అతడితో ఉన్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సెక్స్‌రాకెట్‌కు సంబంధించి, అరెస్టు చేసిన సతీష్‌ సాహు, శరత్‌ పండా, సురేంద్ర గంతాయత్‌లను కోర్టులో హాజరుపరిచినట్లు హృదయానంద తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top