లంచ్‌ బాక్స్‌లో చికెన్‌..విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్‌

Principal Attack Student Over Quarrel About Chicken In Lunch Box - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వనస్థలిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్కూళ్లో జరిగే విషయాలు ఇంట్లో చెబుతావా అంటూ ప్రిన్సిపల్‌ చితకబాదటంతో విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలు.. సాత్విక్‌ అనే బాలుడు స్థానిక ఎన్నారై స్కూళ్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా లంచ్‌ బాక్స్‌లో చికెన్‌ తీసుకుని వెళ్లాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇతర తరగతుల విద్యార్థులు అతడి టిఫిన్‌ బాక్స్‌ లాక్కొని తినేశారు.

ఈ విషయం గురించి సాత్విక్‌ ఇంట్లో చెప్పినట్లు గుర్తించిన ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి.. శుక్రవారం అతడిని ఇష్టారీతిన కొట్టింది. ప్రిన్సిపాల్‌ తీరుతో బెంబేలెత్తిపోయిన సాత్విక్‌కు వాంతులు మొదలయ్యాయి. అదే విధంగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సాత్విక్‌ తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సాత్విక్‌ నానమ్మ, తాతయ్య ఎన్నారై స్కూల్‌ యాజమాన్యంపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top