ఖననం చేసిన మృతశిశువుకు పోస్టుమార్టం

Post-mortem Of The Boy Body - Sakshi

బయ్యారంలో కేసు నమోదు

నర్సింహులపేట : ఖననం చేసిన శిశువు మృతదేహాన్ని నాలుగు రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు శివారు బంజరలో సోమవారం చోటు చేసుకుంది.

స్థానికులు, బయ్యారం ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం.. బంజర గ్రామానికి చెందిన గంగరబోయిన సరిత మానసిక స్థితి సరిగా లేక తన  చేతిలో ఉన్న శిశువును బయ్యారం పాకాల వాగు బ్రిడ్డి పై నుంచి పడేయడంతో శిశువు మృతిచెందిన సంఘటన తెలిసిదే.

అయితే బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటనపై గత గురువారం రాత్రి బయ్యారం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా శిశువు మృతదేహాన్ని ఖననం చేయగా,  పంచనామా, పోస్టుమార్టం నిమిత్తం మరలా వెలికితీశారు.

సోమవారం బయ్యారం తహసీల్దార్‌ పుల్లారావు సమక్షంలో ఎస్సైలు రవీందర్, సంతోస్‌రావు.. బంజరలో పూడ్చిన శిశువు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అలాగే మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రి వైద్యుడు సందీప్‌ అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

అనంతరం బాలుడి మృత దేహాన్ని కుటుంబసభులకు అప్పగించగా మరలా ఖననం చేశారు. పూడ్చివేసిన బాలుడిని వెలిసితీసి పోస్టుమార్టం చేస్తుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top