వీడిన మిస్టరీ 

Police Resolved Murder-case In Sirvella - Sakshi

సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతం శ్రీ సర్వనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో జరిగిన యువకుని హత్య కేసు మిస్టరీ వీడింది. భూమిలో నుంచి బయటకు తేలి వున్న కాలి బొటన వేలు ఈ నెల 12న  ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్నారు. హతుడు ఆళ్లగడ్డ పట్టణం పుల్లారెడ్డి వీధికి చెందిన షేక్‌ జాకీర్‌ బాషా(20)గా గుర్తించారు.

తల నుంచి మొండెం వేరు చేసి ఉండటంతో నర బలి ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తగా విచారణంలో అవన్నీ వదంతులేనని తేల్చారు. నిందితులను బుధవారం అరెస్ట్‌ చేశారు. శిరివెళ్ల, గోస్పాడు ఎస్‌ఐలు తిమ్మారెడ్డి, చంద్రశేఖరరెడ్డి తెలిపిన వివరాలు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువకుడు షేక్‌ జాకీర్‌బాషాతో రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన నీలి శ్రీరాములు, ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన పత్తి నాగప్రసాదు, పత్తి నాగేంద్ర, కోటకందుకూరుకు చెందిన దుర్వేసుల శ్రీనివాసులు, డి.కొట్టాలకు చెందిన దేరంగుల గోపాల్‌కు పరిచయాలున్నాయి.

ఈ క్రమంలో వారందరు కలిసి ఈ నెల 5న వజ్రాల అన్వేషణకు సర్వ నరసింహ్మస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. వజ్రాలు దొరికితే పంచుకునే వాటాలపై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు కలిసి షేక్‌ జాకీర్‌బాషాను కత్తితో గొంతు కోసి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టారు. ఆళ్లగడ్డ, ఇతర గ్రామాల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను సేకరించి నిందితులను గుర్తించారు. బుధవారం రుద్రవరం మండలం చిన్న కంబలూరు మెట్ట వద్ద అనుమానంగా సంచరిస్తుండగా అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి కత్తి, ఇతర పరిçకరాలను స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top