బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో పురోగతి

Police Breakthrough In Vijayawada Gang War Case - Sakshi

సాక్షి, విజయవాడ : బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్ట్రీట్‌ ఫైటర్స్‌ వేటలో వేగం పెంచారు. కొంతమంది గ్యాంగ్‌ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం కూపీ లాగుతున్నారు. స్ట్రీట్‌ ఫైట్‌తో భయానక వాతావరణం సృష్టించిన జులాయిలపై రౌడీ షీట్‌ తెరిచే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలు సైతం​ గ్యాంగ్‌వార్‌ కారణాలపై మూలాల్లోకి వెళ్లి మరీ విచారిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ( పండు.. మామూలోడు కాదు! )

కాగా, డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్‌వార్‌ను పోలీసు కమిషనర్‌ తీవ్రంగా పరిగణించడంతో.. సందీప్‌ మృతితో నిందితులు అందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో పాటు కోవిడ్‌–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. 6 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే డొంకరోడ్డులో పండు గ్యాంగ్‌ సాగించిన కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే 21 మందిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ( గ్యాంగ్‌ వార్‌ : వెలుగులోకి కీలక అంశాలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top