
కొరియర్‌లో వచ్చిన పనికిరాని వస్తువులు
ఏయూ క్యాంపస్(విశా ఖ తూర్పు): భారీ ఆఫర్లతో ముంచెత్తారు. వాటిని నిజమని నమ్మిన ప్రజలు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేశారు. తీరా చేతికి వచ్చిన కొరియర్‌ను తెరిచి చూస్తే పనికిరాని వస్తువులు దర్శనమిచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగి చంద్రాన శశికాంత్‌కు ఈ సంఘటన ఎదురైంది. కొద్ది రోజుల క్రితం పేటీఎం మాల్‌లో భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ప్రకటనలు జారీ చేశారు. దీనిని చూసిన శశికాంత్ శామ్‌సంగ్ బ్లూటూత్ పరికరం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. గురువారం సాయంత్రం వచ్చిన కొరియర్‌ను తెరిచి చూడగా అందులో పనికిరాకుండా, వినియోగించిన, నాసిరకం బ్లూ టూత్ పరికరం దర్శనమిచ్చింది. దీంతో తాను మోసపోయానని, దీనిపై సదరు సంస్థకు ఫిర్యాదు చేస్తానని శశికాంత్ “సాక్షి’కి తెలిపారు. ఇటువంటి చర్యలతో వీటిపై నమ్మకం పోతుందని, భవిష్యత్‌లో కొనుగోలు చేయాలంటే భయం వేస్తుందన్నారు.