
వచ్చిన పార్శిల్, వృత్తంలో గులకరాయి
ప్రకాశం, వేటపాలెం: ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వస్తువు కొనుగోలు చేసిన వినియోగదారుడు మోసపోయాడు. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. దేశాయిపేట పంచాయతీ మంకెనవారిపాలేనికి చెందిన అంగలకుర్తి రవికుమార్ అమేజాన్‌లో ఆన్‌లైన్‌లో హెడ్ సెట్– త్రిడీ వీఆర్‌ను బుక్ చేశాడు. ఆదివారం చీరాలకు చెందిన ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అతడికి పార్శిల్ వచ్చింది. డబ్బులు కట్టి పార్శిల్ తీసుకుని విప్పి చూడగా అందులో గులకరాయి ఉంది. విస్తుపోయిన వినియోగదారుడు రవికుమార్ పార్శిల్ తెచ్చిన వారితో మాట్లాడగా వాపసు చేస్తే బుక్ చేసిన వస్తువు మళ్లీ వస్తుందనడం గమనార్హం.