మోదుకూరు బాధితురాలికి ఇంకా అందని వైద్యం | Sakshi
Sakshi News home page

మోదుకూరు బాధితురాలికి ఇంకా అందని వైద్యం

Published Mon, May 7 2018 5:37 PM

No Treatment For Minor Girl Victim In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికకు ఆస్పత్రికి వచ్చి 6 గంటలు గడిచినా చికిత్స అందించక పోవడం గమనార్హం. గైనకాలజిస్టులు అందుబాటులో లేరంటూ వైద్య సిబ్బంది బాధిత చిన్నారికి పరీక్షలు చేయడం లేదు. దీంతో తమ పాపకు ఏమౌతుందోనని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటలకు బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యుల నిర్లక్ష్యంతో సాయంత్రం ఐదు గంటలు దాటినా చికిత్స ప్రారంభించలేదు.

గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన దాచేపల్లి కీచక ఉదంతాన్ని మరువకముందే మోదుకూరులో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. బావ వరుసయ్యే నిందితుడు నాగుల్‌మీరా(24) చాక్లెట్లు కొనిపెడతానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి చెప్పిన వివరాలతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు రాష్ట్రంలో వరుసగా బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. టీడీపీ సర్కార్ మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

గుంటూరులో మరో దారుణం

Advertisement

తప్పక చదవండి

Advertisement