ప్రేమ హత్యలే అధికం!

NCRB Report: Love Affairs Among Biggest Reasons for Murders in India - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001–2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే.

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top