కొండా విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురు

Nampally Court Rejects Konda Visweswara Reddy Bail Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరష్కరించింది. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన సంఘటనలో కొండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. అయితే అజ్ఞాతంలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం గత వారం రోజులుగా బంజారాహిల్స్‌ పోలీసులు వెతుకుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా చేవేళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్‌ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా బంజారాహిల్స్‌లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అప్పటినుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top