ఎంతపని చేశావు తల్లీ !

Mother Commits Suicide With Two Children in Mandya Karnataka - Sakshi

ఆర్థిక సమస్యలు, భర్త బాధ్యతారాహిత్యం

మనస్తాపంతో పిల్లలతో సహా కాలువలో దూకిన తల్లి

తల్లి మృతి, గల్లంతైన పిల్లలు

కర్ణాటక,మండ్య : చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు, భర్త బాధ్యతారాహిత్యంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలసి చెరువులోకి దూకింది. ఘటనలో తల్లి మృతి చెందగా చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఉదంతం శుక్రవారం మండ్య తాలూకా తిబ్బనహళ్లిలో చోటు చేసుకుంది. తాలూకాలోని హుళ్లేనహళ్లి గ్రామానికి చెందిన నంజప్పకు అదే ప్రాంతానికి చెందిన జ్యోతి (33)తో చాలా కాలం క్రితం వివాహమైంది. కొద్ది కాలంగా నంజప్ప అనారోగ్యంతో బాధ పడుతుండడంతో కుటుంబ పోషణభారం జ్యోతి పై పడింది.

ఈ పరిస్థితుల్లో నంజప్ప ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో అప్పు చేసి ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో కొత్త బైకు కొనాల్సిన అవసరం ఏంటంటూ జ్యోతి తన భర్తను ప్రశ్నించింది. ఇదే విషయమై కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా శుక్రవారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన జ్యోతి ఇద్దరు పిల్లలు నిసర్గ (7), పవన్‌(4)లతో కలసి తిబ్బనహళ్లి గ్రామ సమీపంలోని కాలువలో దూకింది. గమనించిన స్థానికులు కాలువలోకి దూకి రక్షించడానికి ప్రయత్నించారు.అప్పటికే జ్యోతి మృతి చెందగా ఇద్దరు పిల్లల కొట్టుకుపోయారు. ఈ ఘటనతో జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవు తున్నారు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top