చెల్లి కోసం వచ్చి పెళ్లయిన అక్కని తీసుకెళ్లాడు | Man Escape With Married Woman In Tamil Nadu | Sakshi
Sakshi News home page

చిన్నమ్మాయి కోసం వచ్చాడు..పెళ్లయిన పెద్దమ్మాయిని తీసుకెళ్లాడు

Jun 1 2018 8:33 AM | Updated on Jun 1 2018 3:33 PM

Man Escape With Married Woman In Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లిచూపులకు వెళ్లడం, అమ్మాయి నచ్చితే వివాహం చేసుకోవడం, లేకుంటే మరో సంబంధానికి వెళ్లడం మగవారికి మామూలే. అయితే ఓ ప్రబుద్ధుడు చిన్నకూతురిని చేసుకునేందుకు పెళ్లిచూపులకు వచ్చి పెళ్లయి బిడ్డ తల్లయిన పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపి వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది.

పెద్దకుమార్తె అన్నాదురైతో లేచిపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి  మైలాపూరు పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశాడు. తన చిన్నకుమార్తె పెళ్లిచూపులకు వచ్చిన అన్నాదురైతో పెద్ద కుమార్తె లేచిపోయిందని, వెళ్తూ వెళ్తూ ఇంటిలోని ఐదు సవర్ల నగలు, రూ.2లక్షలు నగదును తీసుకుని మూడేళ్ల కుమారుడితో సహా పారిపోయిందని పేర్కొన్నాడు. ప్రేమజంట కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement