విద్యార్థినిపై లైంగికదాడి... ఇద్దరికి జీవిత ఖైదు

సాక్షి, తిరువణ్ణామలై: పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి లైంగికదాడి చేసిన కేసులో ఇద్దరికి జీవిత శిక్ష విధిస్తూ జిల్లా మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. తిరువణ్ణామలై జిల్లా త్యాగి అన్నానగర్‌కు చెందిన అశ్విన్, వినోద్‌లపై పలు కేసులున్నాయి.

సారోన్‌ ప్రాంతానికి చెందిన టీచర్‌ దంపతుల కుమార్తె (16) అదే ప్రాంతంలో పదవ తరగతి చదివేది. సాయంత్రం వేళల్లో అదే ప్రాంతంలో ట్యూషన్‌కు వెళ్లి వచ్చేది. 2014 డిసెంబర్‌ 29న ట్యూషన్‌ ముగించుకొని సాయంత్రం 7 గంటలకు ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో బాలుర పాఠశాల వద్ద దాగి ఉన్న అశ్విన్, వినోద్‌లు కలిసి కత్తి చూపించి కిడ్నాప్‌ చేసి ఆటోలో తరలించి లైంగికదాడి చేశారు.

అనంతరం ఆటోలో తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలి పెట్టి పరారయ్యారు. ఆ సమయంలో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పరారయ్యారు. దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థిని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి తిరువణ్ణామలై మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఐదు సంవత్సరాలుగా విచారణ జరిపిన న్యాయమూర్తి ఆఖరి తీర్పు వెలువరించారు. అశ్విన్, వినోద్‌లకు జీవిత శిక్ష, రూ: 4 వేల జరిమానా విదించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top