అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆత్మహత్య

High Court Inquiry On Agri Gold Case On Hailand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈ శుక్రవారం అగ్రిగోల్డ్‌ కేసు మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది.  హాయ్‌ల్యాండ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఏపీ పోలీసులు కోర్టుకు తెలిపారు. హాయ్‌ల్యాండ్‌ ఎండీ అల్లూరు వెంకటేశ్వరరావును అరెస్ట్‌ చేశామని వారు కోర్టుకు వెల్లడించారు. హాయ్‌ల్యాండ్‌ ప్రాపర్టీపై అగ్రిగోల్డ్‌ యాజమాన్యం వైఖరిని హైకోర్టు ప్రశ్నించింది. వారం లోపు హాయ్‌ల్యాండ్‌ ఆస్తులపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆత్మహత్య
గుంటూరు : అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వినుకొండలో చోటుచేసుకుంది. ధనరాజ్‌ అనే అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top