విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం

Gurukula Students Misiing In Kalwakurthy - Sakshi

సాక్షి, కల్వకుర్తి(మహబూబ్‌నగర్‌) : స్థానిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినుల అదృశ్యం కథ సుఖాంతమైంది. బాలికలు అమ్రాబాద్‌లో క్షేమంగా పట్టుబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు రాజేశ్వరి, పావని, సుజాత, నాగేశ్వరి ఈ నెల 26న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమ సామగ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. అదేరోజు అర్ధరాత్రి కల్వకుర్తి బస్టాండ్‌లో సంచరిస్తున్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు నమోదైంది. అయితే పాఠశాలలోని సీసీ కెమెరాల్లో మాత్రం ఈ దృశ్యాలు నమోదు కాలేదు. ఈ నెల 27న దీపావళి పండుగ కావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. చివరికి మధ్యాహ్నం సమయంలో ఆ నలుగురు విద్యార్థినులు పాఠశాలలో లేరని సిబ్బంది తెలుసుకుని పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయరాంరెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

గురుకులాల కార్యదర్శి ఆరా 
ఈ ఘటనపై రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరా తీశా రు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం ఐటీడీఏ పీఓ వెంకటయ్య, గిరిజన పాఠశాలల ఆర్‌సీఓ కల్యాణిని పాఠశాలకు వెళ్లి అక్కడి సిబ్బంది, తోటి వి ద్యార్థినులతో వివరాలు సేకరించారు. ఇక గిరిజన గురుకుల పాఠశాలలో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా ప నిచేయడం లేదు. ఈ ఘటనపై దృశ్యా లు ఏవీ అందులో రికార్డు కాలేదు. ఈ పాఠశాల నుంచి తప్పిపోయిన విద్యార్థిని సుజాతకు సోమవారం హాజరుపట్టికలో ఉపాధ్యాయులు హాజరు వేయడం గమనార్హం. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా పాఠశాల సిబ్బంది బయటకు పొక్కనీయలేదు. చివరకు పోలీసులతోపాటు తల్లిదండ్రులకు సైతం విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారు. ఈ నలుగురు విద్యార్థినులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వారి ట్రంకు పెట్టెల్లో దొరికిన కొన్ని పత్రాలు, నోట్‌బుక్స్‌లో ఫోన్‌ నంబర్లు, ఉత్తరాల ఆధారంగా అలవాట్లను పాఠశాల సిబ్బంది వివరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top