మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు.. | Gayathri Gupta Case Speedup on Bigg Boss Telugu Management | Sakshi
Sakshi News home page

గాయత్రీ గుప్తా ఫిర్యాదుపై దర్యాప్తు

Jul 16 2019 11:01 AM | Updated on Jul 18 2019 1:53 PM

Gayathri Gupta Case Speedup on Bigg Boss Telugu Management - Sakshi

 అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మూడు నెలల అనంతరం తనను రిజెక్ట్‌ చేసినట్లు ప్రకటించడంతో సినిమా అవకాశాలు కోల్పోయానని గాయత్రిగుప్తా ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.

గచ్చిబౌలి: తన ప్రతిష్టకు భంగం కలిగించడమేగాక, లైగింక వేధింపులకు పాల్పడారని,  సినీ నటి గాయత్రి గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు బిగ్‌బాస్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఆదివారం రాత్రి ఆమె బిగ్‌బాస్‌ అధినేత అభిషేక్, కో–ఆర్డినేటర్‌ రఘుపై రాయదుర్గం పీఎస్‌లో  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మణికొండలోని జైహింద్‌నగర్‌లో ఉంటున్న గాయత్రిగుప్తా సోమవారం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో సినీ నటి గాయత్రీ గుప్తా
ఆమె నుండి వివరాలు సేకరించిన పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అభిషేక్, రఘు ఆమె ఇంటికి వచ్చిన సమయంలో వారి వెంట ఎవరు ఉన్నారనే విషయంపై ఆరా తీయగా, మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా గాయత్రిగుప్తా తెలిపింది. వారిని విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని  డీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను  క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభిషేక్, రఘులకు నోటీసులు అందజేస్తామన్నారు. అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మూడు నెలల అనంతరం తనను రిజెక్ట్‌ చేసినట్లు ప్రకటించడంతో సినిమా అవకాశాలు కోల్పోయానని గాయత్రిగుప్తా ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement