రుషికొండ రేవ్‌ పార్టీ : నలుగురు అరెస్ట్‌

Four Arrested For Supplying Drugs In Rave Party At Rushikonda Beach - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రుషికొండ రేవ్‌ పార్టీ వ్యవహారంలో సీతమ్మధారకు చెందిన ఎం.సత్యనారాయణతో పాటు మరో నలుగురి అరెస్ట్‌ చేశామని ఏసీపీ వైవీ నాయుడు పేర్కొన్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో రుషికొండ సాగరతీరం సర్వే నంబర్‌ 61లో విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ సంస్థ రేవ్‌ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడి చేసి కొంత మందిని పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీపీ వైవీ నాయుడు మాట్లాడుతూ.. నిందితులను నుంచి 9.7 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేనుకున్నామని తెలిపారు.

చదవండి : ఈవెంట్ల పేరుతో రేవ్‌ పార్టీలు!

రేవ్‌ పార్టీలో కొకైన్‌ వినియోగించినట్లు గుర్తించామన్నారు. పార్టీ నిర్వాహకులు ఈ కొకైన్‌ను గోవా నుంచి దిగుమతి చేసుకున్నారని తెలిపారు. ఈ రేవ్‌ పార్టీలో రాజకీయ నాయకుల పిల్లలు లేరని స్పష్టం చేశారు. రుషి కొండ పరిసర ప్రాంతాల్లోని డాబాలు, విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. రేవ్‌ పార్టీపై సీరియస్‌గా ఉన్నామని, మరింత లోతుగా విచారణ జరిపుతామని మీడియాకు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top